కలం, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక శక్తులు బుధవారం ఇండియన్ హై కమిషన్ (Indian High Commission) పై దాడికి యత్నించాయి. గుంపుగా వచ్చిన రాడికల్ గ్రూపులు భారత హై కమిషన్ కార్యాలయం వద్ద బారికేడ్లను దాటుకొని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాయి. బంగ్లాదేశ్‌కు వీసాల జారీని భారత్ నిలిపివేయడంతో ఆందోళనకారులు హై కమిషన్‌ను చుట్టుముట్టారు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు, ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఢిల్లీ అలర్ట్ అయ్యింది. దాడి ఘటనపై వివరణ కోరుతూ బంగ్లా హై కమిషనర్ రియాజ్ హబీబుల్లాను పిలిపించి సమన్లు ఇచ్చింది. బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు, భారత హై కమిషన్ (Indian High Commission)పై రాడికల్ గ్రూపుల దాడికి యూనస్ సర్కార్ మద్దతిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఉగ్రవాదుల బెదిరింపులు, బంగ్లాదేశ్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, భద్రతా సమస్యల కారణంగా ఢాకాలోని ఇండియన్ వీసా దరఖాస్తు కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసింది. పరిస్థితి చక్కబడ్డాక తిరిగి తెరవనున్నట్లు ప్రకటించింది. కాగా, కొన్ని రోజుల నుంచి బంగ్లాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. ఆ దేశ తాత్కాలిక సారథి మహ్మద్ యూనస్‌తోపాటు మరికొందరు ప్రభుత్వాధికారులు, ఆర్మీ ఆఫీసర్లు భారత్‌పై, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
Read Also: తెలంగాణ విద్యుత్ రంగంలో మైలురాయి.. లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథపై ప్రత్యేక శ్రద్ధ!
Follow Us On: X(Twitter)


