Mobile Popup Ad
Mobile Popup Ad

నీట్ పరీక్ష నిర్వహణకు కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు

కలం, వెబ్ డెస్క్: రద్దయిన నీట్ – యూజీ పరీక్షను (NEET Exam) జూన్ 21న మరోసారి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వరుసగా రెండో రోజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి, దుష్ప్రచారం చేస్తున్న నకిలీ టెలిగ్రాం ఛానళ్లను గుర్తించి, వెంటనే వాటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెటా, గూగుల్, టెలిగ్రామ్ ప్రతినిధులతో కేంద్ర మంత్రి కూలంకషంగా సమీక్ష చేశారు. వీరితో పాటు విద్యా శాఖ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఎన్టీఏ అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణకు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఎన్టీఏ మరింత బలోపేతం..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటికే ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు, జాయింట్‌ సెక్రటరీలను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇక నుంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థను సైతం దీని పరిధిలోకి తీసుకురాబోతున్నారు. నీట్ రద్దు కావడంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, ఈసారి ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని భావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>