Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో 25 వేలకు పైగా మూతపడ్డ మెడికల్ షాపులు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 25 వేలకు పైగా మెడికల్ షాపులు (Medical Shops Closed) మూతపడ్డాయి. బుధవారం దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు బంద్‌ చేయాలని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపునివ్వడంతో రాష్ట్రంలో కూడా మెడికల్ షాపులు బంద్ చేయాలని తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అడ్వైజరీ జారీ చేసింది. దీంతో నేడు మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 12 వేలకు పైగా ఔషధ దుకాణాలు బంద్ ఉన్నాయి. అయితే ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులకు మాత్రం బంద్ నుంచి మినహాయింపు ఉంది. కాగా, బంద్ విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని డీసీఏ ఇదివరకే ప్రకటించింది. అత్యవసర మందులు ముందుగానే తెచ్చుకోవాలని ప్రజలకు సూచించింది. అధికారుల నంబర్లు, చిరునామా తమ వెబ్‌సైట్‌లో ఉంటాయని డీసీఏ తెలిపింది. సాయం కోసం డీసీఏ టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 599 6969 సంప్రదించాలని పేర్కొంది.

నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ ను పాటిస్తున్నాయి. ఆన్ లైన్ లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఇదివరకే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోని మందుల దుకాణాలు బంద్ లో పాల్గొంటున్నాయి. ఆన్ లైన్ లో నకిలీ, ప్రమాదకర మందులు సరఫరా చేస్తున్నారని, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ సేవలు నిలుపుదల చేయాలని మందుల దుకాణాల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. నేడు ఒక్కరోజు నిరసనతో దేశవ్యాప్తంగా 12.40 లక్షలకు పైగా మెడికల్ షాపులుబంద్ కానున్నాయి.

మరోవైపు ప్రజలకు మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ముఖ్య కేంద్రాలలో గుర్తించిన మెడికల్ షాపులు, ఆసుపత్రులు, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్ లోని మెడికల్ షాపులు, ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో పనిచేస్తున్న జనరిక్ మెడికల్ షాపులు తెరిచే ఉండనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>