కలం, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్ల (Special Trains for Sankranti) ను నడపనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు ఇవి అదనం. కాగా, కొత్తగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లు జనవరి 9 నుంచి 19 మధ్య అందుబాటులో ఉంటాయి. ఇవి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం రోడ్ స్టేషన్ గమ్యస్థానంగా సికింద్రాబాద్, వికారాబాద్ నుంచి బయల్దేరనున్నాయి. సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07288), శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07289), సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07290), శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07291), వికారాబాద్–శ్రీకాకుళం రోడ్(07294), శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07295), సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07292), శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07293) మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
Special Trains for Sankranti | సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్ ట్రైన్లు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి. వికారాబాద్–శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైళ్లు లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లిలో ఆగుతాయి.
Read Also: ‘శంబాల’ డిస్ట్రిబ్యూటర్స్‌గా మైత్రి, ఉషా పిక్చర్స్
Follow Us On: Pinterest


