Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో కాంగ్రెస్ – బీజేపీ పొలిటికల్ బిజినెస్ : మన్నె క్రిశాంక్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ – బీజేపీ పార్టీల పొలిటికల్ బిజినెస్ నడుస్తోందని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ (Manne Krishank) కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు విషయంలో కాంగ్రెస్ నాయకుడు ఒక్కరు కూడా మాట్లాడలేదన్నారు. అలాగే, కాంగ్రెస్ నాయకులు స్కాములకు పాల్పడితే బీజేపీ నాయకులు స్పందించడం లేదని మన్నె క్రిశాంక్ ఆరోపించారు.

పరస్పర అంగీకారంతో బీజేపీ – కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ వ్యాపారానికి పాల్పడుతున్నారని ఆయన (Manne Krishank)  విమర్శించారు. జర్నలిస్టులను ఎయిర్‌పోర్టు వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారని.. ఇప్పుడు భగీరథ్ పోక్సో కేసు గురించి ఎప్పుడైనా మీడియా సమావేశంలో పోలీసులు మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ – సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిపుచ్చుకొనే ధోరణిని అవలంబిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే బండి భగీరథ్ పోక్సో కేసుపై విచారణ చేపట్టాలని, అలాగే కాంగ్రెస్ స్కామ్ లపై బీజేపీ ఎంక్వైరీ వేయాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>