కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో కీలక మార్పులు రాబోతున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థను కొనసాగిస్తూనే, పేరు మార్పుపై ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ‘స్వర్ణాంధ్ర విజన్ 2047(Swarnandhra Vision 2047)’ లక్ష్యాల సాధనలో భాగంగా ఈ సచివాలయాలను మరింత డేటా ఆధారితంగా, టెక్నాలజీతో కూడిన విధంగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం సచివాలయాలను స్వర్ణాంధ్ర కేంద్రాలు, గ్రామాలను స్వర్ణ గ్రామాలు గా పేరు మార్చే ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Swarnandhra Vision 2047 | స్వర్ణాంధ్రప్రదేశ్ను సాకారం చేసేందుకు ప్రణాళికల రూపకల్పన, అమలులో సచివాలయాలు క్రియాశీలకంగా వ్యవహరించేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. సచివాలయాల పేరు మార్చాలన్న ప్రతిపాదన సీఎంవో పరిశీలనలో ఇప్పటికే ఉంది. సంబంధితశాఖ దాదాపు పది పేర్లు సూచించినట్లు సమాచారం.
Read Also: కవిత అరెస్ట్ : నవ్వుకుంటున్న కేటీఆర్, హరీష్
Follow Us On: X(Twitter)


