కలం డెస్క్: దిగ్గజ ఫుట్‌బాలర్ మెస్సీ(Lionel Messi) ఇటీవల ఇండియా టూర్‌కు వచ్చాడు. ఇందులో అనేక మంది ప్రముఖులను మెస్సీ కలిశాడు. వారిలో బిజినెస్ టైకూన్ అంబానీ ఫ్యామిలీ నుంచి మెస్సీ అల్ట్రా రేర్ గిఫ్ట్ ఒకటి అందుకున్నాడు. తన పర్యటనలో భాగంగా మహారాష్ట్రలో అనంత్ అంబానీ నిర్వహిస్తున్న ‘వంతారా(Vantara)’ వైల్డ్‌లైఫ్ రెస్క్యూ కన్జర్వేషన్‌ను మెస్సీ సందర్శించాడు. ఈ సందర్భంగానే మెస్సీకి అనంత్(Anant Ambani).. ఒక వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాచ్.. దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటారా.. దాని ధర అక్షరాలా రూ.10.9 కోట్లు. అది చాలా అంటే చాలా రేర్ వాచ్. అదే రియర్డ్ మిల్లీ ఆర్ఎం 003-వీ2 జీఎంటీ టూర్‌బిల్లాన్ ఆసియా ఎడిషన్ (Richard Mille RM 003-V2 GMT Tourbillon “Asia Edition”). ఈ వాచ్‌లు ప్రపంచ వ్యాప్తంగా 12 మాత్రమే ఉన్నాయి. అందుకే ఈ వాచ్ చాలా ఎక్స్‌క్లూజివ్ రిచర్డ్ మిల్లీ వాచ్‌గా మారింది. ‘వంతారా’ సందర్శనకు వచ్చినప్పుడు మెస్సీ(Lionel Messi) చేతికి వాచ్ లేదని, ఆ తర్వాత వాచ్ వచ్చిందని వీక్షకులు చెప్తున్నారు. కాబట్టి అది తప్పకుండా అనంత్.. గిఫ్ట్ అని అంటున్నారు.
అసలు ఈ వాచ్ ఫ్యూచర్స్ ఇవే..
మాన్యువల్-వైండింగ్ టూర్‌బిలోన్ మూవ్‌మెంట్, ఇది గంటలు, నిమిషాలు , డ్యుయల్ టైమ్-జోన్ సూచికను చూపిస్తుంది.
రిపోర్ట్ ప్రకారం, వాచ్‌లో ఫంక్షన్ సెలెక్టర్, పవర్-రిజర్వ్ సూచిక, , టార్క్ సూచిక కూడా ఉంది. ఇవన్నీ బ్లాక్ కార్బన్ కేస్ , టైటానియం బేస్‌ప్లేట్ ఉన్న స్కెలెటన్ డయల్‌లో అందంగా ప్రదర్శించబడ్డాయి.
38mm కేస్ Carbon TPT మెటీరియల్ నుండి తయారు చేయబడింది. ఇది మొదట ఏరోస్పేస్, ఫార్ములా 1 రేసింగ్ కోసం అభివృద్ధి చేయబడింది.
వాచ్‌లో ఒక ప్రత్యేక సాప్ఫైర్ డిస్క్ ఉంది, ఇది బ్లాక్ గంటల సంఖ్యలను 3’o’clock స్థానం వద్ద తెల్లగా ఉన్న విభాగంపై “లైట్ అప్” అయ్యినట్లు చూపిస్తుంది.
టూర్‌బిలోన్ మూవ్‌మెంట్ సరిగ్గా సమయాన్ని నిలుపుకోవడానికి గురుత్వాకర్షణ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
వాచ్‌లో ఒక స్మార్ట్ మెకానిజం ఉంది, ఇది వాడేవారు క్రౌన్‌లోని పుషర్ ద్వారా వైండింగ్, న్యూట్రల్, , హ్యాండ్-సెట్టింగ్ మోడ్‌ల మధ్య సులభంగా మారవచ్చు.
ఈ ప్రత్యేక రిచర్డ్ మైల్ టైమ్‌పీస్‌ను కొందరు మాత్రమే కలిగి ఉంటారు. వారిలో అందులో బ్రూనే సుల్తాన్ హసనాల్ బోల్కియా, ఫార్ములా 1 డ్రైవర్ మిక్ షుమాఖర్, మాజీ FIA ప్రెసిడెంట్ , ఫెరారీ టీం ప్రిన్సిపల్ ఉన్నారు.
Read Also: IPL వేలం పూర్తి.. పది జట్లు ఇవే..
Follow Us On: Sharechat


