కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ టూర్ (T20 World Cup 2026 Tour) స్టార్ట్ అయింది. రామసేతు (ఆడమ్స్ బ్రిడ్జ్) మీదుగా ఐసీసీ ఈ టూర్ ప్రారంభించింది. భారత్–శ్రీలంకలను కలిపే ప్రతిష్టాత్మక ద్వారంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో, భారత దక్షిణ తీరాన్ని నేపథ్యంగా తీసుకుని రెండు సీట్ల పారామోటార్ ద్వారా ట్రోఫీని ఆకాశంలోకి తీసుకెళ్లడం ద్వారా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ వెండి ట్రోఫీ భారత్, శ్రీలంకతో పాటు ఖతార్, ఒమాన్, నేపాల్, బహ్రెయిన్, మంగోలియా వంటి దేశాల్లో పర్యటించనుంది. క్యాంపస్ సందర్శనలు, అభిమానుల సమావేశాలు, ప్రజా కార్యక్రమాల ద్వారా అభిమానులకు ట్రోఫీని దగ్గరగా చూసే అవకాశం కల్పించనున్నారు. అలాగే, పాఠశాలలు, కళాశాలలకు ట్రోఫీని తీసుకెళ్లి యువతలో క్రికెట్‌పై ఆసక్తిని పెంచనున్నారు.
భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరగనున్న 2026 టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2026) వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో 20 జట్లు పాల్గొననున్నాయి. ప్రారంభ మ్యాచ్ పాకిస్తాన్–నెదర్లాండ్స్ మధ్య జరగనుండగా, అదే రోజు ముంబైలో భారత్ అమెరికాతో తలపడనుంది.
Read Also: IPL వేలం పూర్తి.. పది జట్లు ఇవే..
Follow Us On: Instagram


