కలం వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఆడియెన్స్‌ను అలరించేందుకు మరో సస్పెన్స్ థ్రిల్లర్ సిద్ధమైంది. యంగ్ హీరో ఆది సాయికుమార్(Aadi Saikumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’(Shambala) షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు యగంధర్ ముని దర్వకత్వం వహించారు. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటికే ఈ చిత్రానికి(Shambala) సంబంధించిన వర్క్ అంతా పూర్తయ్యింది. శంబాల నుంచి విడుదలైన మేకింగ్ వీడియో, టీజర్, ట్రైలర్ ప్రత ఒక్కటి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నాయి. సినిమా అంచనాలకు అనుగుణంగా భారీ సంస్థలు ‘శంబాల’ను అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. నైజాం(Nizam) ఏరియాలో మైత్రి(Mythri), ఏపీ, సీడెడ్ ఏరియాలో ఉషా పిక్చర్స్(Usha Pictures) డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఓవర్సీస్‌లో సైతం ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయబోతోన్నారు. ఓవర్సీస్ బాధ్యతల్ని మూన్ షైన్ సినిమాస్ తీసుకుంది. డిసెంబర్ 25న విడుదల కానున్న శంబాల ఆది కెరీర్‌లో మైలురాయిగా మారుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: మొదలైన టీ20 ప్రపంచకప్ టూర్.. రామసేతుపై అద్భుత దృశ్యం!
Follow Us On: Youtube


