Mobile Popup Ad
Mobile Popup Ad

ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?.. అధికారుల నిరక్ష్యానికి ఒకరు బలి!

కలం మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) అర్బన్ మండలం మందపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తన ఇంటి ముందున్న రోడ్డుపై ఓ వ్యక్తి అడ్డంగా గోడ కట్టారని రాములు(60) ఆరోపించాడు. ఈ విషయమై కలెక్టర్, DPOలకు సైతం ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా రాములుని చంపేస్తామని పలువురు బెదిరించారు. న్యాయం దక్కకపోవడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం (Suicide) చేశాడు. సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ రాములు మృతిచెందాడు. గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదని, రాములు చావుకు అధికారులే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>