కలం వెబ్ డెస్క్ : అమరావతిలోని సచివాలయంలో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు(Chandrababu) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్ వేరే రంగం నుంచి వచ్చినా అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీ రాజ్(Panchayat Raj) వ్యవస్థను గాడిలో పెట్టారని చెప్పారు. ఇటీవల ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగితే పవన్ కల్యాణ్ ఆ రోడ్డు నిర్మాణం కోసం రూ.3.90 కోట్లు మంజూరు చేయించారని చెప్పారు. ఇక మంత్రి నారా లోకేష్ సైతం రాష్ట్ర అభివృద్ధి ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గూగుల్ సంస్థ రాష్ట్రానికి రావడంలో నారా లోకేష్ పాత్ర ఉందని చెప్పారు. లోకేష్ కృషితోనే రాష్ట్రంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి సాకారమైందన్నారు.
Read Also: వ్యవస్థల దుర్వినియోగంతోనే సమస్యలు : సీఎం చంద్రబాబు
Follow Us On: Pinterest


