కలం, వెబ్‌డెస్క్: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి (MLA Ram Mohan Reddy) తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Poll Code Violation Allegations) ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే స్వగ్రామమైన వికారాబాద్ జిల్లా దోమ మండలం శివారెడ్డిపల్లి గ్రామంలో పోలింగ్ జరుగుతోంది. అయితే గ్రామంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి (MLA Ram Mohan Reddy) పోలింగ్ కేంద్రానికి అతి సమీపంలో కుర్చీ వేసుకొని కుర్చున్నారు. పోలింగ్ కేంద్రానికి వస్తున్న ఓటర్లను ఎమ్మెల్యే ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో మద్దతు దారులు ఓడిపోయారు. దీంతో రామ్మోహన్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం.
తమ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే పరువుపోతుందన్న భావనతో ఎమ్మెల్యే(MLA Ram Mohan Reddy) స్వయంగా రంగంలోకి దిగారని అంటున్నారు. పోలింగ్‌కు వచ్చిన ఓటర్లను గెలిపించాలని అభ్యర్థిస్తూ, నేరుగా పోలింగ్ కేంద్రం వద్దే కూర్చున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే తన సొంత గ్రామంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు తప్ప ఎవరినీ ప్రభావితం చేయడం లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Poll Code Violation Allegations) ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల నియమాల ప్రకారం పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ప్రచారం చేయడం నిషేధం కాగా, ఎమ్మెల్యే అక్కడే కూర్చొని వ్యవహరించినా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైన నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు మౌనం వహించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు ఆరోపించారు.
Follow Us On: Sharechat


