కలం వెబ్ డెస్క్ : డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు(Raghurama Krishnam Raju)ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్(PV Sunil Kumar) సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ(YCP) హయాంలో నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సీఐడీ పోలీస్ కస్టడీ(CID custody)లో చిత్రహింసలకు గురయ్యారన్న కేసులో సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సస్పెండ్(suspension) చేసి ఆయనపై విచారణ చేపట్టారు. విచారణ సక్రమంగా జరిగేందుకు తనను సస్పెండ్ చేసినట్లు రఘురామను కూడా పదవి నుంచి సస్పెండ్ చేయాలని సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం తనను సస్పెండ్ చేయడం మంచిదే కానీ, సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజును కూడా అన్ని పదవులనుండి సస్పెండ్ చేయాలి కదా అని సునీల్ కుమార్(PV Sunil Kumar) ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానం అనే సందేశమివ్వాలని కోరారు.
Read Also: నగర ప్రాంతాల్లో ఉంటున్నోళ్లు సన్నాసులు: బీజేపీ ఎమ్మెల్యే
Follow Us On: X(Twitter)


