Mobile Popup Ad
Mobile Popup Ad

‘నా సహనం నశిస్తోంది’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండురోజుల చైనా పర్యటన ముగిసింది. ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసిన ఈ టూర్ లో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో తన సహనం, ఓపిక నశిస్తోందని.. ఆ దేశం తక్షణమే ఒక ఒప్పందానికి రావాలని వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ అంగీకరించారని ఆయన తెలిపారు. అలాగే, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తునన చైనా కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేసే అంశంపై ఆలోచిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు చైనాను ఎలాంటి సహాయం అడగడం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు భారత్ లో పర్యటిస్తున్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాగ్చి ఇరాన్ – యూఎస్ యుద్ధం స్పందించారు. ఉద్రిక్తతలపై చర్చలను పునరుద్దరించేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేస్తూ తమకు లేఖలు పంపిందన్నారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ మిత్ర దేశాల నైకలు హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించవచ్చు అని అరాగ్చి స్పష్టం చేశారు.

Read Also: ఐపీఎల్ అభిమానులు జాగ్రత్త : సీపీ సజ్జనార్ హెచ్చరిక

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>