Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ.. రైతులకు భరోసా

కలం, ఖమ్మం బ్యూరో: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతో పాటు, కొనుగోలు ప్రక్రియలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohit Raju) అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా సుజాతనగర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొనుగోలు తీరును పరిశీలించారు. ​ఈ సందర్భంగా ఎస్పీ నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ధాన్యం తూకంలో జాప్యం, గన్నీ బ్యాగుల లభ్యత, రవాణా సౌకర్యాల గురించి రైతులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన, రైతుల పక్షాన నిలబడి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్ పట్టాలను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా లారీల ఏర్పాటును పర్యవేక్షించాలని ఆదేశించారు.

అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా స్థానిక ఎస్సైలు, సిబ్బంది నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ​అనంతరం ధాన్యం గ్రేడింగ్ చేసే విధానాన్ని పరిశీలించిన ఎస్పీ (SP Rohit Raju), నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. “ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ రైతులకు సేవలందిస్తుంది. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి” అని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. ఈ తనిఖీలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమాదేవి, రవి ఇతర శాఖల సిబ్బంది, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: భోజ్‌శాల మసీద్ కాంప్లెక్స్ కాదు.. హిందూ ఆలయమే: మధ్యప్రదేశ్ హైకోర్టు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>