Mobile Popup Ad
Mobile Popup Ad

మ‌క్కల కొనుగోళ్ల జాప్యంపై ఎమ్మెల్యే గంగుల ఆగ్రహం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) శుక్రవారం సందర్శించారు. మొక్కజొన్న కొనుగోళ్ల గురించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 15 రోజులుగా తాము మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యాన్ని మార్క్ ఫెడ్ కొనుగోలు చేయడం లేదని ఈ సందర్భంగా రైతులు గంగుల కమలాకర్‌కు మొర పెట్టుకున్నారు. మార్కెట్‌లో అసౌకర్యాలతో పాటు దొంగల బెడద ఉందని, తాగేందుకు తాగు నీరు, ఎండ నుంచి రక్షణకు నీడ కూడా లేదని వాపోయారు. దీంతో గంగుల కమలాకర్ మార్కెట్ అధికారులతో ఫోన్ లో సంప్రదించి గత 15 రోజులుగా మక్కలను కొనుగోలు చేయక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అకాల వర్షాలు పడే ప్రమాదం ఉందని, యుద్దప్రాతిపదికన మక్కలను వెంటనే కాంటా పెట్టి, సరిపడా లారీలు పెట్టి గోదాంలకు తరలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నాకు దిగుతామని గంగుల (Gangula Kamalakar) హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాం సుంధర్ రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ‌న్‌లు పొన్నం అనిల్, ఏనుగు రవీందర్ రెడ్డి, తిరుపతి నాయక్, సుంకిశాల సంపత్ రావు, గోనె నర్సయ్య, మంద రాజమల్లు, అరే శ్రీకాంత్, పబ్బతి రంగారెడ్డి, జువ్వాడి రాజేశ్వర్ రావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

 Read Also: మహిళలే బెటర్.. ఫిమేల్ పోలీస్ ఆఫీసర్ల పర్ఫామెన్స్‌పై డీజీపీ ప్రశంసలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>