epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వంతారాలో లియోనెల్ మెస్సీ సందడి..

కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) వంతారా పార్క్ లో సందడి చేశాడు. ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ నిర్వహిస్తున్న ఈ పార్క్ కు మంగళవారం రాత్రి మెస్సీతో పాటు రోడ్రిగో డీ, లూయిస్ సువారెజ్ వచ్చారు. వారికి అనంత్ అంబానీ(Anant Ambani), రాధికా దంపతులు జానపద సంగీతం, పూలవర్షం కురిపించి వెల్కమ్ చెప్పారు. అనంతరం అంబే పూజ, గణేష్ పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో మెస్సీ కూడా పాల్గొన్నాడు. వంతారా పార్క్(Vantara) లో అడవులను, జంతువులను గౌరవించాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాటిని మెస్సీ (Lionel Messi) దగ్గరుండి పరిశీలించాడు. ఈ సందర్భంగా పార్క్ లో పులులు, సింహాలతో ఫొటోలు దిగాడు ఈ ఫుట్ బాల్ స్టార్. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: రోడ్డు కావాలన్న కానిస్టేబుల్.. మంజూరు చేసిన పవన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>