కలం, వెబ్ డెస్క్ : మంగళగిరిలో నేడు ఏపీ ప్రభుత్వం 5757 కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అరుదైన ఘటన జరిగింది. అల్లూరి జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన గిరిజన యువకుడు బాబురావు తమ ఊరికి రోడ్డు వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను కోరారు. స్పందించిన పవన్ కల్యాణ్ వెంటనే అధికారులను ఆదేశించారు. సభ ముగిసేలోపు రోడ్డును మంజూరు చేయించారు. మొన్న అంధుల మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ దీపిక(Deepika) కూడా తమ ఊరికి రోడ్డు కావాలని కోరిన వెంటనే పవన్ మంజూరు చేసిన విషయం మనకు తెలిసిందే.
Read Also: జగన్ వస్తే ఉన్న ఉద్యోగాలు ఊడుతాయ్ : చంద్రబాబు
Follow Us On: Youtube


