కలం, వెబ్ డెస్క్: దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలంటూ వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ చేసిన సూచనల మేరకు తిరుపతిలో సామాజిక బాధ్యతగా ఆయన సైకిల్ తొక్కారు. ఇంధన పొదుపుపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఇంధన (Fuel Saving) వినియోగాన్ని అదుపులో ఉంచుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పెరుగుతున్న భారీ ఖర్చులను తగ్గించుకునేలా చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కాలుష్య నియంత్రణకు, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రజలంతా సహకరించి, ఇంధనాన్ని పొదుపు చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డి సైకిల్ తొక్కిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also: రిజల్ట్స్‌లో 6 మార్కులు.. రీవాల్యుయేషన్లో 60కి 60 మార్కులు!
Follow Us On : WhatsApp

