కలం, వెబ్ డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) మరోసారి కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కడియం శ్రీహరి(Kadiyam Srihari) నీకు సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్. నీ కూతురుకి బీఫారం తీసుకుని, పార్టీ నుండి డబ్బులు తీసుకుని, కాంగ్రెస్ పార్టీకి పోయినవ్, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే నైతిక అర్హత నీకు లేదు. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి నా మీద గెలువు. ఊర్లల్లకి పోతే ప్రజలు నీకు చెప్పుల దండలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గురించి, పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అని మండిపడ్డారు.
‘‘ఢిల్లీకి పోయి ఖర్గేను కలిసి వచ్చినంక పిచ్చి లేసినట్టు మాట్లాడుతున్నావు. ప్రజాదరణ ఉంది అంటున్నావు కదా.. మరి రాజీనామా చెయ్. నువ్వు రాజీనామా చేస్తే జనాలు నీకు మళ్లీ రాజకీయ జీవితం లేకుండా చేస్తారు’’ అని తాటికొండ రాజయ్య విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో స్టేషన్ ఘన్‌పూర్ పేరు తరుచుగా వినిపిస్తుంటుంది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah), కడియం శ్రీహరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఒకప్పుడు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ తరచుగా అభిప్రాయ బేధాలొచ్చాయి. అధిష్ఠానం కలుగజేసుకొని సర్దిచెప్పేది. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పుడు రాజయ్య కడియం శ్రీహరిని టార్గెట్ చేయడం, కడియం అధికారంలో ఉన్నప్పుడు రాజయ్యను టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం కడియం కాంగ్రెస్‌లో ఉండగా, రాజయ్య బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు.
Read Also: కొండగట్టు ఆలయానికి అటవీశాఖ నోటీసులు
Follow Us On: X(Twitter)


