కలం వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగంలో ఎంపికైన 5,757 మంది కొత్త కానిస్టేబుళ్ల (New Police Constables) కు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళగిరి(Mangalagiri)లోని ఏపీఎస్పీ పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలీస్ శాఖ రాష్ట్ర భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, చట్టసమానత్వాన్ని కాపాడే విధంగా పోలీసులు విధులు నిర్వహించాలని సూచించారు. కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లు నైతిక విలువలు, క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు బలంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
Read Also: టీడీపీ ఏపీ జిల్లా అధ్యక్షులు ఖరారు?
Follow Us On: X(Twitter)


