Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలి: కలెక్టర్

కలం, కరీంనగర్ బ్యూరో: బక్రీద్ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) ఆదేశించారు. బక్రీద్‌ పండుగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో పాటు ముస్లిం మత పెద్దలతో బుధవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, జిల్లా స్థాయి అధికారులు, ముస్లిం మత పెద్దలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు బక్రీద్‌ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ముస్లిం మత పెద్దల సూచనలు, సలహాలను స్వీకరించి అధికారులకు పలు దిశానిర్దేశాలు చేశారు.

బక్రీద్‌ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పని చేయాలని కలెక్టర్ సూచించారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈద్గాల వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు నమాజ్‌ సమయంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. మసీదుల పరిసరాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా వేస్ట్‌ కవర్లను పంపిణీ చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సమయానికి నీరు అందేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ.. బక్రీద్‌ పండుగ సందర్భంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నగరంలో పూర్తి స్థాయి బందోబస్తు నిర్వహిస్తూ పండుగను సామరస్య వాతావరణంలో నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నా మని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ ఆర్డీవోలు కే మహేశ్వర్ రమేష్ బాబు, జిల్లాస్థాయి అధికారులు , ముస్లిం మత పెద్దలు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ డిఆర్డిఓ గా ఎం. గీత

కరీంనగర్ జిల్లా డిఆర్డిఓ గా ఎం గీత బాధ్యతలు స్వీకరించారు. గతంలో డిప్యూటీ సీఈవో జడ్‌పిపితో పాటు DRDO(I/C)గా రాజన్న సిరిసిల్లలో పని చేసి CEO గా ప్రమోషన్ తో కరీంనగర్ DRDO గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎం గీత జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ను మర్యాద పూర్వకంగా కలిసి బాధ్యతలు స్వీకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>