కలం, వెబ్ డెస్క్: సంక్రాంతి(Sankranthi) అంటే ముగ్గులు, పిండివంటలు, పతంగులు మాత్రమే కాదు.. కోడి పందాలు (Cockfighting) కూడా. అందుకే సంక్రాంతి సమీపిస్తున్నకొద్దీ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన వాతావరణం కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాల్లో మూడు రోజుల వేడుకలు ఘనంగా జరుగుతాయి. సంక్రాంతికి కోడి పందాలు ఆకర్షణగా నిలుస్తాయి. స్థానికులు, సందర్శకులు వాటిని చూడటానికి పెద్ద సంఖ్యలో గుమిగూడతారు. రాజకీయ నాయకులు ప్రతిష్టాత్మకంగా కోడి పందాలను నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పందాల్లో భారీ మొత్తంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. సంక్రాంతిని దృష్టిలో ఉంచుకొని పందెంరాయుళ్లు కోళ్లను సిద్ధం చేయడంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. నెలరోజుల ముందునుంచే భారీ పుంజులతో రంగం సిద్ధం చేసుకుంటారు.
ఈ సంక్రాంతి (Sankranthi)కి కోట్లలో పందాలు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే పందెంరాయుళ్లు ఏపీలోని ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేస్తున్నారు. రూ. 5, 10,50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పందాలు జరగవచ్చునని తెలుస్తోంది. పందెం కోళ్ళకు ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వేపాకు, కుంకుడకు, ఉసిరాకు, వట్టివేరు, పసుపు ఉపయోగించి స్నానం చేయిస్తున్నారు. స్నానం చేసిన తర్వాత కోళ్లను గోనె సంచుల్లో చుట్టి ఉంచుతున్నారు. వాటిని ఈతకు తీసుకెళ్లి వ్యాయామాలు చేయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కోళ్లకు ఓర్పు, పోరాట సామర్థ్యం అలవడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
Read Also: జగన్ కోర్టులను లెక్క చేయడు.. చంద్రబాబు ఫైర్
Follow Us On: Sharechat


