మ‌రో 12 రోజులు ఐబొమ్మ ర‌విపై విచార‌ణ

కలం వెబ్ డెస్క్ : ప్రముఖ పైర‌సీ వెబ్‌సైట్ ఐబొమ్మకు సంబంధించిన కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న ఐబొమ్మ రవి(iBOMMA Ravi)పై సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) మరోసారి విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే జైలులో ఉన్న రవిని మరో 12 రోజుల పాటు పోలీసుల కస్టడీకి ఇవ్వడానికి నాంపల్లి కోర్టు (Nampally Court) మంగ‌ళ‌వారం అనుమతిచ్చింది.

రవిపై నమోదైన నాలుగు వేర్వేరు కేసుల విచారణ కోసం ఒక్కో కేసుకు మూడు రోజుల చొప్పున మొత్తం 12 రోజులు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రవి(iBOMMA Ravi)ని విచారించనున్నారు. ఆన్‌లైన్ పైరసీ (online piracy), అక్రమ ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల దుర్వినియోగం వంటి అంశాలపై పోలీసులు రవిని విచారించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప‌లు ఆధారాలు, బ్యాంక్ లావాదేవీలు స్వాధీనం చేసుకున్నారు. ర‌విపై మ‌రోసారి విచార‌ణ చేప‌డితే మ‌రింత స‌మాచారం బ‌య‌ట‌కు రావొచ్చ‌ని అధికారులు భావిస్తున్నారు.

Read Also: ఉపాధి హామీని మోడీ ధ్వంసం చేస్తున్నారు : రాహుల్ గాంధీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>