కలం, వెబ్ డెస్క్ : సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్(Roshan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఛాంపియన్. ఈ మూవీ కోసం రామ్ చరణ్(Ram Charan) రంగంలోకి దిగుతున్నాడు. ఛాంపియన్(Champion) ను ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మూవీపై మంచి అంచనాలను పెంచేశాయి. కథ కూడా కొత్తగా అనిపిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఈ నెల 18న నిర్వహించాలని ప్లాన్ చేశారు. వాస్తవానికి ఈ ట్రైలర్ ఈవెంట్ ను మొదట సెట్ లోనే చిన్నగా ప్లాన్ చేయాలి అనుకున్నారు. కానీ ప్రేక్షకుల్లో మరింత హైప్ ను క్రియేట్ చేయడం కోసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను పెద్దగా ప్లాన్ చేశారు.
వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది కాబట్టి ఈవెంట్ ను గ్రాండ్ గా చేస్తోంది. ఈవెంట్ కు రామ్ చరణ్ (Ram Charan) చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. చరణ్ చేతుల మీదుగానే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. రామ్ చరణ్ రాకతో మూవీకి మంచి క్రేజ్ పెరుగుతుందని మూవీ టీమ్ భావిస్తోంది. రామ్ చరణ్ చాలా కాలం తర్వాత ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోతున్నాడు. పెండ్లి సందడి మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని రోషన్ ఈ మూవీ చేస్తున్నాడు. టీజర్, పాటలు చూస్తుంటే ఈ కథ స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథ అని తెలుస్తోంది. ఇలాంటి పాతకాలం కథలపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది.
Read Also: చికిరి సాంగ్ క్రేజ్.. తెలుగులో 100 మిలియన్ వ్యూస్
Follow Us On: Sharechat


