Mobile Popup Ad
Mobile Popup Ad

జన జీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్రనేత!

కలం, వెబ్‌ డెస్క్‌ : వరంగల్ లో పుట్టి అడవి బాట పట్టిన కీలక మావోయిస్టు నేత పసునూరి నరహరి (Maoist Narahari) అలియాస్ సంతోష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా అగ్రస్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన తన భార్యతో కలిసి తెలంగాణ ఎస్ఐబీ అధికారుల సమక్షంలో లొంగిపోవడం గమనార్హం.

దళ సభ్యుడి స్థాయి నుండి సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఎదిగిన నరహరి దశాబ్దాల కాలం పాటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అనారోగ్య కారణాలు, వ్యక్తిగత పరిస్థితుల రీత్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన ఈయన రాకతో మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ప్రభుత్వ పునరావాస పథకాల పట్ల ఆకర్షితులై ఆయన జన జీవన స్రవంతిలో కలిశారు.

 Read Also: ఒకప్పుడు టాప్ మావోయిస్ట్.. ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>