epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సింగరేణి ఇన్​చార్జి సీఎండీగా కృష్ణభాస్కర్​

కలం, వెబ్​డెస్క్​: సింగరేణి ఇన్​చార్జి సీఎండీగా ఐఏఎస్​ అధికారి కృష్ణభాస్కర్ (Krishna Bhaskar)​ నియమితులయ్యారు. ​ప్రస్తుతం సీఎండీగా ఉన్న బలరాం డిప్యటేషన్​ గడువు ముగియడంతో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కృష్ణభాస్కర్​కు బాధ్యతలు అప్పగించారు. కేంద్ర రెవెన్యూ సర్వీసుల నుంచి డిప్యుటేషన్​ మీద వచ్చిన బలరాం.. సింగరేణిలో ఆరేళ్ల పాటు వేర్వేరు హోదాల్లో పనిచేశారు. సాధారణంగా డిప్యుటేషన్​ ఐదేళ్లే ఉంటుంది. అయితే, మరో ఏడాది పాటు అదనంగా ఆయన సర్వీసును కేంద్రం పొడిగించింది. కాగా, కృష్ణభాస్కర్​ ప్రస్తుతం తెలంగాణ ట్రాన్స్​కో సీఎండీగా పనిచేస్తున్నారు.

Read Also: కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ కోవ‌ర్టులున్నారు : మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>