Mobile Popup Ad
Mobile Popup Ad

బీఆర్ఎస్‌వీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

కలం, కరీంనగర్ బ్యూరో: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ (NEET Paper Leak)కి మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ నీట్ పరీక్ష రద్దుకు నిరసనగా బీఆర్ఎస్‌వీ జిల్లా మాజీ అధ్యక్షుడు , జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే నని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ సర్కార్ అంధకారంలోకి నెట్టిందని, ఇలా పేపర్ లీకేజీ ల ద్వారా ఇప్పటి వరకు 53 లక్షల పై చిలుకు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడింది అని అన్నారు. ఇలా పేపర్ లీకేజీ (NEET Paper Leak) కాకుండా జరిగితే దారుణమైన శిక్షలను విధించేలా ప్రత్యేక చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు . పరీక్ష నిర్వహణలో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (NTA) ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పగలు రాత్రి కష్టపడి చదివిన విద్యార్థులకు మోదీ ప్రభుత్వం ఇచ్చే బహుమతి పేపర్ లీకేజీలా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి, వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడానికే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించడం లేదని అన్నారు.

ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ NTA డైరెక్టర్ జనరల్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. లీకు వీరులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇక ముందు ఇలా జరగకుండా నిందితులకు ఉరిశిక్ష విధించాలని, అకడమిక్ క్యాలెండర్ దెబ్బతినకుండా వెంటనే పకడ్బందీగా పరీక్షా తేదీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్‌వీ శాతవాహన యూనివర్సిటీ BRSV ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, నగర BRSV అధ్యక్షులు బొంకూరి మోహన్, నారదాసు వసంత్ రావు, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, వడ్లకొండ పరుశరామ్, అన్వేష్, సోహెల్, క్రాంతి, శ్రవణ్, రవి గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Read Also: బంగారంపై కొత్త పథకం.. కేంద్రం కీలక నిర్ణయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>