Mobile Popup Ad
Mobile Popup Ad

శుభకార్యాలకు బ్రేక్‌.. మళ్లీ ముహూర్తాలు ఎప్పుడంటే?

కలం, వెబ్‌ డెస్క్ : రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం రానుంది. ఈ మూఢమి కారణంగా వివాహాలు నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో ఈనెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరుగుతున్నాయి. జూన్ 19 నుంచి తిరిగి వివాహాది శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి.

ఈ ఏడాదిలో ఉన్న మంచి రోజులు ఇవే..

ఈ ఏడాదిలో మిగిలిన ముహూర్తాల (Muhurtham Dates) వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ నెలలో 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో పెళ్లిళ్లు జరుపుకోవచ్చు. జూలైలో 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. ఆగస్టులో 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 రోజుల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబరులో 1, 3, 4, 5 తేదీలు కేటాయించారు. అక్టోబర్‌లో 11, 14, 29, 30 ముహూర్తాలు లభిస్తాయి. నవంబర్‌లో 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26 తేదీలు వివాహాలకు అనుకూలంగా ఉన్నాయి. డిసెంబర్‌లో 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో భారీగా ముహూర్తాలు ఉన్నాయి.

Read Also: రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>