Mobile Popup Ad
Mobile Popup Ad

ట్రాన్స్‌జెండర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. జీవో విడుదల

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ట్రాన్స్‌జెండర్లకు (Transgenders) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి సంక్షేమ బోర్డుకు సభ్యులను నియమిస్తూ జీవో విడుదల చేసింది. దీనిపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ హర్షం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై ఇటీవల మంత్రి నారా లోకేశ్‌కు విన్నవించగా.. సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. ట్రాన్స్‌జెండర్ల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాజాగా జీవో విడుదల చేయడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

కలెక్టర్ల సిఫార్సులే కీలకం..

ట్రాన్స్‌జెండర్ల వెల్ఫేర్‌ బోర్డుకు సభ్యుల నియామకంలో కలెక్టర్లకే కీలక బాధ్యతలను ఏపీ ప్రభుత్వం అప్పగించింది. విశాఖపట్నం, తిరుపతి కలెక్టర్లను మాత్రం ప్రాంతీయ ప్రతినిధులుగా నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సంక్షేమ బోర్డు పూర్తి స్థాయిలో కొలువుదీరడం వలన వారి సమస్యలకు మరింత వేగంగా పరిష్కారం లభించడంతో పాటు అవసరమైతే చట్టాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. సమాజంలో ట్రాన్స్ జెండర్ల జీవన ప్రమాణాలు పెంచడం, వారికి ఉద్యోగవకాశాల కల్పన వంటికి వేగవంతం అవుతాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>