కలం, వెబ్ డెస్క్ : మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ ఆర్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చుక్కారావు అలియాస్ దామోదర్ అరెస్ట్ (Damodar) అయ్యారు. ములుగు జిల్లాకు చెందిన ఆయన దామోదర్ ఆదిలాబాద్ నుంచి సేఫ్ జోన్ వెళ్తుండగా సిర్పూర్ కాగజ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో 15 మందిని పట్టుకున్నారు. ఈ 15 మందిలో ఏడుగురు మగవారు, 9 మంది మహిళలు ఉన్నారు. వారిని హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ కు తీసుకెళ్లారు.
అరెస్ట్ అయిన దామోదర్ (Damodar) తో పాటు మిగతా 15 మందిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని తెలంగాణ ప్రజా స్వామిక వేదిక డిమాండ్ చేసింది.
Read Also: కొండా సురేఖ వర్సెస్ బస్వరాజు సారయ్య .. వరంగల్‌లో మరోసారి చిచ్చు
Follow Us On: Youtube


