కలం డెస్క్: ఐపీఎల్ 2026 మినీ వేలం(IPL Auction 2026) ప్రారంభమైన తొలి రోజే భారీ హైడ్రామా చోటుచేసుకుంది. ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron Green) భారీ ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన గ్రీన్‌ను దక్కించుకునేందుకు తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కూడా రేసులోకి రావడంతో వేలం మరింత ఉత్కంఠభరితంగా మారింది.
చివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.25.20 కోట్లకు గ్రీన్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కెమెరూన్ గ్రీన్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2024లో మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేయగా, ఆ రికార్డును ఇప్పుడు గ్రీన్ అధిగమించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో గ్రీన్‌ది మూడో అత్యధిక ధరగా నిలిచింది. ఈ జాబితాలో రిషభ్ పంత్ (రూ.27 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు – పంజాబ్ కింగ్స్) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇదే వేలం(IPL Auction 2026)లో సౌతాఫ్రికా అనుభవజ్ఞ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను దిల్లీ క్యాపిటల్స్ అతడి కనీస ధర రూ.2 కోట్లకే దక్కించుకుంది. అయితే న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే, ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (కనీస ధర రూ.2 కోట్లు), భారత బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ (కనీస ధర రూ.75 లక్షలు) మాత్రం అన్‌సోల్డ్‌గా మిగిలారు.
Read Also: మెస్సీ టూర్‌పై రంజిత్ బజాజ్ హాట్ కామెంట్స్ !
Follow Us On: Pinterest


