epaper
Friday, January 16, 2026
spot_img
epaper

చికిరి సాంగ్ క్రేజ్.. తెలుగులో 100 మిలియన్ వ్యూస్

కలం, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలైన నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. ‘చికిరి చికిరి(Chikiri Chikiri)’ రిలీజ్‌తో ఆ సంచలనం మరింతగా పెరిగింది. అప్పటి నుండి అన్ని భాషల్లో మంచి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట మ్యూజిక్ ఆల్బమ్స్‌లో రికార్డ్స్ క్రియేట్స్ చేస్తోంది.

రామ్ చరణ్‌ మాస్ లుక్‌‌లో ఆకట్టుకునే స్టెప్పులతో అదరగొట్టాడు. యూత్ మొత్తం చికిరి సాంగ్‌కు స్టెప్పులు వేసి రీల్స్ చేశారు. ఇటీవల ఏ పాటకి రాని రెస్పాన్స్ చికిరికి వచ్చింది. ఫలితంగా తెలుగులోనే 100 మిలియన్ల వ్యూస్ దాటింది. ఐదు భాషలలో 150 మిలియన్ల వ్యూస్‌ను దాటింది. తెలుగులోనే కాదు.. చికిరి దేశవ్యాప్తంగా మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకుంది. చికిరి (Chikiri) ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతుండడంతో, రాబోయే రోజుల్లో మరిన్ని వ్యూస్‌ను కొల్లగొట్టే అవకాశాలున్నాయి. ఏఆర్ రెహమన్ క్యాచీ టున్స్‌కు రామ్ చరణ్ అదిరిపొయే హుక్ స్టెప్ వేయడంతో ఈ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. చికిరి సాంగ్‌ పెద్ది ప్రీ-రిలీజ్ బజ్‌ను మరింత పెంచుతోంది.

Read Also:  ఆ వార్త‌లు నిజం కాదు.. న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>