Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్రంలో ప్రజా సమస్యలు పట్టించుకునే ఏకైక పార్టీ బీజేపీ: ఈటల

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పట్టించుకునే ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభ విజయవంతమైన సందర్భంగా.. కంటోన్మెంట్ లోని గాయత్రి గార్డెన్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రధాని సమావేశానికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు తరలి వచ్చారని చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, డివిజన్ల నాయకులు, అపార్ట్మెంట్స్ పాలకమండలిలు, నార్త్ ఇండియ సమాజం వారి సహకారంతో మీటింగ్ విజయవంతం అయ్యిందని తెలిపారు. సభా ప్రాంగణంలో ఎంత మంది ఉన్నారో బయట కూడా అంతమంది ఉన్నారని చెప్పారు. ప్రధాని మీటింగ్ తో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డమీద గెలబోయేది బీజేపీ అని మోదీ సంకేతాలు ఇచ్చారని కొనియాడారు. తాను 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని అన్నారు.

త్వరలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశం పెట్టుకుంటామని ఈటల తెలిపారు. మోదీ మూడవ సారి ప్రధాని అయ్యాక ప్రతి రాష్ట్రంలో గెలుచుకుంటూ దేశమంతా బీజేపీని విస్తరించారని అన్నారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమస్యలు తీరాలన్నా.. రాష్ట్రం అప్పుల ఊబిలోనుండి బయటపడాలన్నా, రైతుల విద్యార్థుల సమస్యలు తీరాలన్న బీజేపీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీని ఆశీర్వదించాలని.. ప్రధాని ఆలోచన మేరకు తాము నడుచుకుంటామని అన్నారు.

స్వదేశీ ఉత్పత్తులు ఎక్కువగా వాడాలని విదేశీ మారక ద్రవ్యం ఖర్చు కాకుండా చూడాలని మోదీ కోరారు. అమెరికాలో సైతం పెట్రోల్ గ్యాస్ ధరలు పెరిగాయని.. ప్రపంచమంతా యుద్ధం ప్రభావం పడిందన్నారు. బీజేపీలో నాయకత్వానికి కొదవలేదని అన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టే ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని దుయ్యబట్టారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలని హితవు పలికారు. అధికారంలో ఉంటాం పోతాం కానీ మాట శాశ్వతంగా ఉంటుందని చెప్పారు.

Read Also: తెలంగాణ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం: సీఎం రేవంత్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>