కలం, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన కెరీర్‌లో ఎంతోమంది డైరెక్టర్లతో కలిసి పనిచేశాడు. కానీ మొదటిసారి ఓ డైరెక్టర్‌కు లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓజీ దర్శకుడు సుజీత్‌కు బహుమతి ఇవ్వడంలో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రీరిలీజ్ ఈవెంట్లలో డైరెక్టర్ల ప్రతిభను మెచ్చుకుంటుంటారు. కానీ సుజీత్‌తో మాత్రం పవన్ మంచి సంబంధాలు కొనసాగించాడు. సినిమా ప్రారంభం నుంచి విడుదల వరకు సహకరించాడు.
పవన్‌లో అభిమానులు అరుదుగా చూసే కోణాన్ని సుజీత్ బయటకు తీసుకురాగలిగాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ వేషధారణ (గ్యాంగ్‌స్టర్ లుక్) అందర్నీ ఆకట్టుకుంది. ఇంతకు ముందు ఏ దర్శకుడు సాధించలేనిది సుజీత్ చేసి చూపాడు. సక్సెస్ మీట్‌లోనూ పవన్ సుజీత్‌పై (Sujeeth) ప్రశంసల వర్షం కురిపించాడు. జానీ మూవీ సుజీత్ సినిమాల్లోకి రావడానికి ప్రేరణనిచ్చిందని అన్నారు. సుజీత్ లాంటి బృందం ఉంటే జానీ పెద్ద విజయం సాధించేదని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. ఓజీ బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్లు వసూలు చేసి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియ రెడ్డి నటించారు.
Read Also: ఓజీ డైరెక్టర్‌కు పవన్ కళ్యాణ్ కాస్ట్లీ గిఫ్ట్, ప్రత్యేకత ఇదే!
Follow Us On: Pinterest


