Mobile Popup Ad
Mobile Popup Ad

MIకి హార్దిక్ షాక్? సోషల్ మీడియాలో ‘అన్‌ఫాలో’..!

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 సీజన్ నుండి ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిష్క్రమించిన వేళ, ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సోషల్ మీడియాలో చేసిన ఒక చిన్న మార్పు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకున్న వెంటనే హార్దిక్ ఆ జట్టును ఇన్ స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారంటూ వస్తున్న వార్తలు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మే 10న రాయ్‌పూర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా గాలిలో కలిసిపోయాయి.

అయితే, మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేశారని నెటిజన్లు గమనించారు. ఆ సమయంలో ఆయన ఫాలోయింగ్ లిస్ట్ 150కి పడిపోయిందని, అందులో ముంబై టీమ్ పేరు లేదని స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న సమయంలోనే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కొద్ది నిమిషాలకే హార్దిక్ (Hardik Pandya) ఫాలోయింగ్ లిస్ట్ మళ్ళీ 151కి చేరింది.

ముంబై ఇండియన్స్ ఖాతా మళ్ళీ ఆయన లిస్ట్‌లో కనిపించింది. ఇది పొరపాటున జరిగిందా లేక కావాలనే చేశారా అనే విషయం పక్కన పెడితే, రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్ అయినప్పటి నుండి ఆయనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ చిన్న అంశం కూడా పెద్ద వివాదంగా మారింది. మరోవైపు జట్టు వైఫల్యాలు, సోషల్ మీడియా ట్రోల్స్ ఎలా ఉన్నా, ముంబై ఇండియన్స్ యాజమాన్యం మాత్రం హార్దిక్ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కెప్టెన్సీ వల్లే జట్టు ఓడిపోలేదని, జట్టు మొత్తం వైఫల్యం చెందిందని వారు భావిస్తున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>