కలం, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి కేసు (Parakamani Case) పై ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్రంగా స్పందించింది. పరకామణిలో జరిగింది కేవలం దొంగతనం కాదని, దానికన్న తీవ్రమైన నేరం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. టీటీడీ (TTD)లో ఆధునిక సాంకేతికత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ముఖ్యంగా ఏఐ ఆధారిత వ్యవస్థలను అమలు చేయాలని సూచించింది. ఏదైనా తప్పు లేదా అనుమానాస్పద పరిస్థితి చోటుచేసుకుంటే వెంటనే అప్రమత్తం చేసే విజిలెన్స్ టెక్నాలజీ (Vigilance Technology) ఉండాలని వెల్లడించింది.
అలాగే, టీటీడీ ఔట్ సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదని ఉన్నత న్యాయస్థాన అభిప్రాయపడింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైన బాధ్యత లేనందునే పరకామణిలో ఇలాంటి ఘటన జరిగిందని వెల్లడించింది. విరాళాల కౌంటింగ్ కోసం ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలని, లెక్కింపు ప్రక్రియలో భక్తులను ఎందుకు భాగస్వాముల్ని చేయకూడదని ప్రశ్నించింది. అలాగే, లెక్కింపు ప్రక్రియలో పూర్తిస్థాయిలో టెక్నాలజీ వినిగించడం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. పరకామణిలో జరిగే ప్రతి దశను పారదర్శకంగా నిర్వహిచాల్సిన బాధ్యత టీటీడీపైనే ఉందని తేల్చి చెప్పింది. పరకామణి కేసుకు (Parakamani Case) సంబంధించిన తదుపరి విచారణకు శుక్రవారం కి వాయిదా వేసింది.
Read Also: థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి లూత్రా బ్రదర్స్
Follow Us On: X(Twitter)


