Mobile Popup Ad
Mobile Popup Ad

ఎల్లుండి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ మీటింగ్

కలం, వెబ్ డెస్క్: సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఈనెల 12వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన పార్టీ నేతల ముఖ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ మరియు శాసనమండలి పక్షాల ఉప నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్చార్జిల నియామకం, పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. కేసీఆర్ సమావేశం కావడంతో ఆయన చేసే వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>