కలం వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు (Prabhakar Rao) విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయనను నాలుగు రోజుల పాటు విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు మంగళవారం ఐదో రోజు విచారణ కొనసాగించారు. కాగా, ఈ ఐదు రోజుల్లో ఆయన నుంచి ఎలాంటి వివరాలు రాబట్టలేకపోయారని తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు కస్టడీలో పోలీసులకు ప్రభాకర్ రావు(Prabhakar Rao) ఏమాత్రం సహకరించడం లేదు. అధికారులు అడుగుతున్న అన్ని ప్రశ్నలకు మౌనంగానే ఉంటున్నారు. ఆధారాలు ముందుంచినా ఆయన నోరుమెదపడం లేదు. ఐ క్లౌడ్, జీమెయిల్ ఖాతాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రభాకర్ రావుకు సంబంధించిన అన్ని డిజిటల్ ఖాతాలపై పోలీసులు దృష్టిసారించారు. ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ఉపయోగించిన ఎలక్ట్రానిక్ డివైస్‌ల గురించి ఆరా తీస్తున్నారు. కానీ, ఆయన దేన్నీ అంగీకరించకపోగా, తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల పాటు ప్రభాకర్ రావు విచారణ కొనసాగనుంది. ఈ రెండు రోజుల్లో అయినా అధికారులు ఏమైనా వివరాలు రాబడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: ఐడీపీఎల్ భూముల అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
Follow Us On: X(Twitter)


