Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం విజయ్‌కు ఇద్దరు సెక్రటరీల నియామకం

కలం, వెబ్ డెస్క్: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ (CM Vijay).. ఇక తన టీంను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన సీఎంవోలోకి సమర్థులైన అధికారులను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే.. ప్రస్తుతం అదనపు చీఫ్ సెక్రటరీ హోదాలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలు చూస్తున్న డాక్టర్ పి.సెంథిల్ కుమార్‌ని సీఎం విజయ్‌కు మొదటి సెక్రటరీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ చూస్తున్న జి.లక్ష్మి ప్రియను రెండో సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరు ప్రస్తుతానికి ముఖ్యమంత్రికి సెక్రటరీలుగా వ్యవహరించబోతున్నారు.

త్వరలోనే భారీగా బదిలీలు..

సీఎంవో నుంచి అధికారుల ప్రక్షాళన ప్రారంభించిన సీఎం విజయ్.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల బదిలీలు చేపట్టే అవకాశం ఉంది. జాబితాపై కసరత్తు చేయగానే.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>