కలం వెబ్ డెస్క్: ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరు మార్పు దేశంలోనే హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంపై విపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు మంగళవారం పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. గ్రామీణ భారతాన్ని రక్షించాలని, MGNREGA ను కాపాడాలని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి మహాత్మా గాంధీని అవమానిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుత గ్రామీణ ఉపాధి చట్టమైన MGNREGAను పేరును వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్(VB G RAM G)గా మార్చేందుకు కేంద్రం సోమవారం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టింది.
దీనిపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం పేరు మార్పుపై ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మాట్లాడుతూ ప్రభుత్వం ఎందుకు పేరు మార్చాలనుకుంటుందో అర్థం కావడంలేదన్నారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, ఇప్పుడు పేరు మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కొన్ని కొత్త అంశాలు జోడించినంత మాత్రాన ఏం లాభం జరుగుతుందన్నారు. ఈ బిల్లు పేద ప్రజల హక్కులను, గ్రామ పంచాయతీల అధికారాలను బలహీనపరుస్తుందని తెలిపారు. బిల్లులో పని దినాలు పెంచినట్లు ప్రకటించారు కానీ, వేతనాలు ఏమైనా పెంచారా అని ప్రియాంకా ప్రశ్నించారు.
Read Also: ప్రధాని మోడీ అభినవ గాడ్సే : వైఎస్ షర్మిల
Follow Us On: Pinterest


