Mobile Popup Ad
Mobile Popup Ad

పెళ్లి ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి!

కలం, జనగామ బ్యూరో: జనగామ (Jangaon) జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) పెళ్లి ఇంట్లో విషాదాన్ని నింపింది. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సోమయ్య (55) అక్కడికక్కడే మృతి చెందాడు. సోమయ్య తన కుమారుడి పెళ్లి సందర్భంగా ఫంక్షన్ హాల్‌కు ట్రాక్టర్‌లో కట్టెలు తీసుకెళ్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ఉన్న సోమయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన విలేకరులు లక్ష్మీపతి, వేణులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించగా వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఇదిలా ఉండగా కుమారుడి పెళ్లి వేడుకలతో సందడిగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లి ఇంట్లో ఆనందం కన్నీళ్లుగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Read Also: సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడు.. “నన్ను కాపాడండి” అంటూ వేడుకోలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>