Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ సచివాలయంపై డ్రోన్ కలకలం.. భద్రతా సిబ్బంది ఉలికిపాటు!

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సచివాలయం (AP Secretariat) వద్ద చోటుచేసుకున్న డ్రోన్ కలకలం అధికారులను, భద్రతా సిబ్బందిని ఉలికిపాటుకు గురిచేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సచివాలయ ప్రాంగణంలో ఉన్నట్టుండి ఓ అనుమానాస్పద డ్రోన్ గాలిలో చక్కర్లు కొట్టడం తీవ్ర సంచలనంగా మారింది. అది నిఘా కోసం ఎగురవేసిన డ్రోనా (Drone) లేక శిక్షణ కోసం వినియోగిస్తున్న ట్రైనింగ్ ఫ్లైటా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నాయి. నిషేధిత జోన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం భద్రతా వైఫల్యమా అనే చర్చకు దారితీయగా, పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>