కలం, వెబ్ డెస్క్: ఈ సారి బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే దానిపై జోరుగా చర్చ మొదలైంది. సీజన్ -9 (Bigg Boss 9) ఫైనల్స్ కు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో తనూజ, ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్, సంజన ఉన్నారు. ఇందులో ముగ్గురు ఇమ్మాన్యుయెల్, తనూజ, కల్యాణ్ మధ్యనే ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. వీళ్ల ముగ్గరిలో ఎవరు బలంగా ఈ వారం పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్లే గెలిచే ఛాన్స్ ఉంది. అయితే ఎక్కువగా కళ్యాణ్ కే సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు అతనికే ఓటింగ్ ఎక్కువగా వస్తోంది. కళ్యాణ్ జవాన్ గా పనిచేయడం వల్ల అతనికి పాజిటివ్ నెస్ బాగానే పెరిగిందని అంటున్నారు నెటిజన్లు.
పైగా బిగ్ బాస్ సోషల్ మీడియాలో ఏ స్ట్రాటజీ ట్రెండ్ అయితే దాన్నే ఫాలో అవుతుందని గతంలోనే తేలింది. ఇప్పుడు కూడా అలాంటి సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సారి కల్యాణ్ ను విన్నర్ ను చేస్తే బిగ్ బాస్ (Bigg Boss 9) కు ఇమేజ్ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారంట. పైగా ఓటింగ్ పరంగానే కాకుండా కళ్యాణ్ గేమ్ కూడా బాగానే ఆడుతున్నారు. కాబట్టి అతన్నే విన్నర్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Read Also: వాళ్లను పట్టించుకోను.. అనిల్ రావిపూడి సీరియస్ కామెంట్స్
Follow Us On: Youtube


