epaper
Friday, January 16, 2026
spot_img
epaper

సెల్ఫీ కోసం వచ్చి కాల్చేశారు.. కబడ్డీ ప్లేయర్​ మృతి

కలం, వెబ్ డెస్క్​ : పంజాబ్ లో జరిగిన కబడ్డీ టోర్నమెంట్​ లో కాల్పులు కలకలం రేపాయి. మొహాలిలోని సోహ్నీ మైదానంలోజరిగిన కబడ్డీ మ్యాచ్​ (Mohali Firing) లో ఒక్కసారిగా దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రముఖ కబడ్డీ ఆటగాడు న్వర్‌ దిగ్విజయ్‌ సింగ్‌ (30) మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. దుండగులు ముందుగా కన్వర్‌ దిగ్విజయ్‌ సింగ్‌ (Kanwar Digvijay Sing)తో సెల్ఫీ తీసుకుందామంటూ దగ్గరకు వెళ్లి, అనంతరం ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు వార్మప్‌ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గన్‌షాట్స్‌ వినిపించడంతో మైదానంలో గందరగోళం నెలకొంది. ప్రాణభయంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు పరుగులు తీశారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్‌ఎస్‌పీ హర్మన్‌దీప్‌ సింగ్‌ హన్స్‌ మాట్లాడుతూ, “కబడ్డీ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కాల్పులు (Mohali Firing) జరిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది” అని తెలిపారు. కాల్పుల అనంతరం మైదానంలో పలు తూటాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు, దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు గల కారణాలు, దుండగుల వివరాలను ప్రాథమిక విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Read Also: బిగ్ బాస్ విన్నర్ ఎవరు.. ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారా..?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>