కలం, వెబ్ డెస్క్ : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చనిపోతా అని ఓట్లు అడగడం బీఆర్ఎస్ కు అలావాటైపోయింది. కాంగ్రెస్ (Congress) మద్ధతు ఇచ్చే సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి లేకపోతే నేను కూడా చనిపోతా’ అని అనిరుధ్ రెడ్డి అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) మద్ధతుదారులు గెలిస్తే నిధులు ఇవ్వం అని చెప్పారు. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలోనే పేదలకు ఇండ్లను మంజూరు చేయిస్తామని ప్రకటించారు.
మధ్యవర్తిత్వం లేకుండా అర్హులకే లబ్ది చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత పాలకులు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇచ్చే వారిని గెలిపించాలని అని అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ మద్ధతు దారులను గెలిపించకపోతే చనిపోతానని చెప్పిన అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) మాటలు ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: నెల రోజుల ముందుగానే మీటింగ్.. కేసీఆర్ ఇచ్చే క్లారిటీపై ఊహాగానాలు
Follow Us On: Pinterest


