తిరుమల(Tirumala) శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి 2026 మార్చి నెల కోటా టికెట్లతో ఇతర దర్శనాల టికెట్లపై టీటీడీ అప్డేట్ ఇచ్చింది. ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు ఈ సేవా లక్కీ డ్రిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు కేటాయించిన వారంతా రెండు రోజుల్లో అంటే 22న మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్ లైన్ లోనే సంబంధిత ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, ఊంజల్ సేవా టికెట్లను 22న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తుంది టీటీడీ.
వీటితో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 23న ఉదయం 11 గంటల వరకు రిలీజ్ చేస్తారు టీటీడీ(Tirumala) అధికారులు. ఇక 24వ తేదీన ఉదయం 10 గంటలకు రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం మూడింటికి అద్దె గదులకు సంబంధించిన కోటా టికెట్లు అందుబాటులోకి వస్తాయి. వీటన్నింటినీ టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు.
Read Also: పీపీపీ మంచిదేనని పార్లమెంటరీ కమిటీ తేల్చింది : చంద్రబాబు
Follow Us On: X(Twitter)


