Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రాచీన శివాలయాన్ని కావాలని కూల్చలేదు.. కలెక్టర్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోక్‌నగర్ గ్రామంలో దేవాలయం (Ancient Shiva Temple) కూల్చివేతపై వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ సత్య శారద వివరణ ఇచ్చారు. దేవాలయాన్ని కావాలని కూల్చివేయలేదని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిని చదును చేసే పనుల్లో భాగంగా పొదలను తొలగిస్తుండగా పాత శిథిలావస్థలో ఉన్న నిర్మాణ అవశేషాలు కనిపించాయని తెలిపారు. శివాలయ నిర్మాణం చాలా కాలంగా శిథిలావస్థలో ఉండి, చెట్లు, పొదల మధ్య కనిపించకుండా పోయిందని తేలింది. కాబట్టి, రక్షిత దేవాలయం లేదా పురావస్తు కట్టడాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన ఘటన జరగలేదని స్పష్టం చేశారు.

భూమి దట్టమైన చెట్లు, పొదలతో నిండిఉందని ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ, పురావస్తు శాఖ రికార్డుల పరిశీలనలో ఈ భూమి ప్రభుత్వ భూమిగా నమోదై ఉందని, ఎండోమెంట్స్ శాఖ భూమిగా నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఈ భూమి గతంలోనే గిరిజన సంక్షేమ శాఖకు కేటాయించినట్లు రికార్డులలో ఉందని, పైగా పురావస్తు శాఖ రికార్డుల్లో ఈ నిర్మాణం రక్షిత దేవాలయం లేదా పురావస్తు కట్టడంగా నమోదు కాలేదని తెలిపారు. ప్రజలు, మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకుని మాత్రమే వార్తలను ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>