కలం, వెబ్ డెస్క్: చంటిపిల్లలకు తరచూ డైపర్లు(Baby Diapers) వేస్తే చాలా రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటికి అస్సాంకు చెందిన ఓ విద్యార్థిని రూపొందించిన ఈ-మ్యాట్ (E-Mat) ఇప్పుడు కొత్త మార్గాన్ని చూపిస్తోందని అంటున్నారు నెటిజన్లు. రీసెంట్ గా ఎన్ సీఈఆర్ టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో సోనిత్ పుర్ జిల్లాకు చెందిన 7వ తరగతి స్టూడెంట్ హర్షిక ఆలమ్మయాన్ పాల్గొంది. ఇందులో ఆమె రూపొందించిన సెన్సార్లతో పనిచేసే ఈ మ్యాట్ అందరినీ ఆకట్టుకుంది.
దీన్ని చిన్న పిల్లల పరుపు కింద పెడితే.. వాళ్లు మల, మూత్ర విసర్జన చేసినప్పుడు తేమను ఈ-మ్యాట్ (E-Mat) సెన్సార్ల ద్వారా గ్రహించి సౌండ్ లేకుండా వైబ్రేషన్లు ఇస్తుంది. దీంతో పక్కనే ఉన్న పేరెంట్స్ లేదా వేరే వాళ్లు అలర్ట్ అయి బేబీని క్లీన్ చేయొచ్చు అని హర్షిక చెబుతోంది. ఈ మ్యాట్ ను అందరూ యూజ్ చేయొచ్చని ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతోంది హర్షిక స్పష్టం చేసింది. ఆమె రూపొందించిన ఈ ప్రాజెక్టుకు ఎగ్జిబిషన్ నిర్వాహకులు సర్టిఫికెట్ ఇచ్చి ప్రశంసించారు.
Read Also: యువతి హిజాబ్ లాగిన సీఎం నితీశ్
Follow Us On: Youtube


