Mobile Popup Ad
Mobile Popup Ad

పశ్చిమాసియాలో టెన్షన్ : ఇరాన్ పై మరోసారి అమెరికా దాడి

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పడిందనుకున్న వేళ మరోసారి టెన్షన్ వాతావరణం మొదలయింది. ఇరాన్ (Iran) కు చెందిన ఆయిల్ ట్యాంకర్ పై అమెరికా (US) దాడికి పాల్పడింది. దీనికి ప్రతిఘటనగా హర్మూజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేసినట్లు ఆ దేశ అధికారులు గురువారం ప్రకటన విడుదల చేశారు. తమ దాడుల వల్ల దెబ్బతినడంతో అమెరికా నౌకలు వెనక్కి తగ్గవలసి వచ్చిందని ఇరాన్ పేర్కొంది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్న మూడు అమెరికా డిస్ట్రాయర్లపై తమ నౌకాదళం లక్ష్యంగా దాడులు చేసింది. అయితే, తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని అమెరికా వెల్లడించింది. ఇరాన్ చేసిన దాడి కారణంగా ఆత్మరక్షణలో భాగంగానే తాము కూడా దాడికి దిగాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>